YSRCP MPTCs resign: మండల పరిషత్ సమావేశాలు జరిగే సమయంలో సహజంగా ప్రతిపక్ష పార్టీ నేతలు తమ ప్రాంతంలో పనులు జరగడం లేదని.. బిల్లులు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటారు. కానీ గుంటూరు జిల్లా తెనాలి మండల పరిషత్ సమావేశంలో అధికార పార్టీకి చెందిన ఎంపీటీసీలు తమ ప్రాంతంలో సమస్యలు పరిష్కారం కావడం లేదని రాజీనామా లేఖలు అందజేశారు.
సమస్యలు పరిష్కారం కావడం లేదని.. ఎంపీటీసీల రాజీనామా..! - ap news
YSRCP MPTCs resign: గుంటూరు జిల్లా తెనాలి మండల పరిషత్ సమావేశంలో అధికార పార్టీకి చెందిన ఎంపీటీసీలు తమ ప్రాంతంలో సమస్యలు పరిష్కారం కావడం లేదని రాజీనామా లేఖలు అందజేశారు. పనులు ప్రారంభించి మూడు సంవత్సరాలైనా అంగుళం కూడా కదల్లేదని ఒకరు రాజీనామా చేయగా.. కమిషన్లు ఇవ్వలేదని బిల్లులు నిలిపి వేశారని మరొకరు ఆరోపించారు.
మండల పరిషత్ సమావేశం జరుగుతూ ఉండగా.. కొలకలూరు గ్రామానికి చెందిన ఎంపీటీసీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కొలకలూరు-హనుమరలపూడి గ్రామాలను కలుపుతూ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించి మూడు సంవత్సరాలైనా.. అంగుళం కూడా కదల్లేదని ఒకటవ సెగ్మెంట్ ఎంపీటీసీ ఫణి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి ఒకటో తేదీలోగా పనులు ప్రారంభించకపోతే ఇదే నా రాజీనామా పత్రం అంటూ ముందుస్తు రాజీనామా పత్రం అందజేశారు. సొంత నిధులు 20 లక్షల రూపాయలు వెచ్చించి పనులు నిర్వహిస్తే.. కమిషన్లు ఇవ్వలేదని బిల్లులు నిలిపి వేశారని తేలప్రోలు ఎంపీటీసీ భాష ఆరోపించారు.
ఇవీ చదవండి: