గుంటూరు జిల్లా గురజాల నియోజక వర్గంలో ఆసక్తికర ఘటన జరిగింది. ఇవాళ మధ్యాహ్నం కోల్డ్ స్టోరేజ్‌లో ఎమ్మెల్సీ జంగా కృష్ణామూర్తి ఆధ్వర్యంలో ఎంపీటీసీ(MPTC) ల ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఆ వెంటనే గురజాల నుంచి వచ్చిన ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సమక్షంలో స్థానిక విజయభాస్కర్ సినిమా హాలులో రెండోసారి ప్రమాణ స్వీకారం చేయంచారు. ఈ వింతను చూసిన సభ్యులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
MPTC: ఎమ్మెల్సీ సమక్షంలో ఎంపీటీసీల ప్రమాణస్వీకారం.. అంతలోనే ఎమ్మెల్యే... - ఎంపీటీసీలు
ఎంపీటీసీ(MPTC) అభ్యర్థులు రెండు సార్లు ప్రమాణ స్వీకారం చేశారు. మొదట ఎమ్మెల్సీ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే సమక్షంలో రెండో సారి ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో అక్కడున్న ప్రజలు అవాక్కయ్యారు.
MPTC: రెండుసార్లు ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీటీసీలు