వ్యవసాయశాఖ కమిషనరేట్ ఎదుట ఎంపీఈవోల ఆందోళన - undefined
రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనరేట్ ఎదుట ఎంపీఈవోలు ఆందోళనకు దిగారు. తమను క్రమబద్ధీకరించాలంటూ ధర్నా చేశారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ప్రత్యేక కమిషనర్ అరుణ్‌కుమార్ వారికి హామీ ఇచ్చారు.

గుంటూరులోని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనరేట్ కార్యాలయాన్ని ఎంపీఈవోలు ముట్టడించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన ఎంపీఈవోలు నినదించారు. వ్యవసాయ శాఖలో నాలుగేళ్లుగా 4వేల మంది బహుళ ప్రయోజన విస్తరణ అధికారులుగా పని చేస్తున్నామని..., ఇప్పుడు గ్రామస్థాయిలో వేరే పోస్టులు సృష్టించి, డీఎస్సీ నియామకం ద్వారా ఎంపికైన తమను ప్రభుత్వం విస్మరించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. పాదయాత్రలో జగన్ ఇచ్చిన మాట ప్రకారం తమ సర్వీసులను క్రమబద్ధీకరించాలని ఎంపీఈవోలు కోరారు. న్యాయ, సాంకేతికపరంగా ఉన్న ఇబ్బందులను వివరించిన ప్రత్యేక కమిషనర్.. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు
TAGGED:
mpeos darna