కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సేవ చేసేందుకు ప్రజాప్రతినిధులు బయటకు రావాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయో వాటిని పర్యవేక్షించాల్సిన బాధ్యత వారిపై ఉందని చెప్పారు. ఇలాంటి సమయంలో ఇంట్లోనే ఉంటామంటే కుదరదని... బయటకు వచ్చి అధికారులు నిర్వహించే సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నలంద విద్యాసంస్థల ఆధ్వర్యంలో పేదలకు, పోలీసులకు, వాలంటీర్లకు అందించే నిత్యావసర వస్తువులు, పౌష్టికాహారం డోర్ డెలివరీ చేసే వాహనాన్ని తాడేపల్లిలోని ఆయన నివాసం వద్ద జెండా ఊపి ప్రారంభించారు.
'ప్రజాప్రతినిధులు ఇంట్లో ఉండటం సమంజసం కాదు' - ఎంపీ విజయసాయి రెడ్డి తాజా వార్తలు
కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సేవ చేసేందుకు ప్రజాప్రతినిధులు సైతం అధికారులకు తోడ్పాటు అందించాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు.
'అధికారులు పనిచేస్తుంటే... ప్రజాప్రతినిధులు ఇంట్లో ఉంటారా?'