ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పిడుగురాళ్ల, నడికుడి రైల్వే స్టేషన్లలో సమస్యలు పరిష్కరించండి.. రైళ్లు ఆపించండి' - రైల్వే పనులపై గుంటూరు డిఆర్‌ఎమ్‌ మోహన్‌ రాజా ఆరా

పిడుగురాళ్ల, నడికుడి రైల్వేస్టేషన్లలో పరిధిలోని సమస్యలను త్వరగా పరిష్కరించాలని గుంటూరు డీఆర్‌ఎమ్‌ మోహన్‌ రాజాను నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. స్థానికంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, కార్యచరణ గురించి మోహన్‌ రాజాతో కలిసి పరిశీలించారు.

mp srikrishnadevarayalu review on Development programs
రైల్వే సమస్యలు పరిష్కరించి ప్రజలకు మేలు చేయాలి

By

Published : Jan 9, 2021, 7:38 AM IST

గుంటూరు రైల్వే డివిజన్​లోని పిడుగురాళ్ల, నడికుడి రైల్వేస్టేషన్ల పరిధిలో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించి.. పల్నాడు ప్రజలకు మేలు చేయాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు.. డీఆర్ఎమ్ కోరారు. ఈ స్టేషన్ల పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల కోసం చేపట్టాల్సిన కార్యచరణ గురించి ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి, గుంటూరు డీఆర్‌ఎమ్‌ మోహన్‌ రాజాతో కలిసి పరిశీలించారు. ఆయా స్టేషన్లలోని సమస్యలను డీఆర్‌ఎమ్‌కు వివరించారు. ఆర్‌యూబీ, ఆర్‌ఓబీల అభివృద్ధి గురించి ప్రస్తావించారు. ఈనెల 15వ తేదీ నుంచి రైతులకు వీలుగా కిసాన్‌ రైల్‌ ఏర్పాటవుతున్నట్లు ఎంపీ పేర్కొన్నారు.

పిడుగురాళ్ల స్టేషన్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, కీలక‌ ట్రైన్లు ఆపేలా చూడాలని డీఆర్‌ఎమ్‌ను కోరారు. జానపాడు, కేసానుపల్లి రైల్వేగేట్‌ను పరిశీలించారు. ఇక్కడ ఆర్‌ఓబీ ఇప్పటికే మంజూరయ్యిందని త్వరలో ఏర్పాటవుతున్నట్లు ఎంపీ తెలిపారు. పల్నాడు ప్రాంతంలో ప్రధాన జంక్షన్‌, నడికుడి స్టేషన్‌ను పర్యవేక్షించారు. గతంలో ఉన్న రైల్వే పోలీస్‌ స్టేషన్‌ను తిరిగి నడికుడి జంక్షన్‌లో ఏర్పాటు చేయాలన్నారు. ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా మరింత సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే మాచర్ల నుంచి గుంటూరు ప్యాసింజర్‌కు ప్రస్తుతం ఉన్న 8 బోగీలను 12కు పెంచాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details