అర్థరాత్రి వరకు ఎంపీ రఘురామకు కొనసాగిన వైద్య పరీక్షలు - mp raghu rama krishnam raju shifted to GGH guntur news
23:33 May 15
జీజీహెచ్‌కు ఎంపీ రఘురామ తరలింపు
ఎంపీ రఘురామకు గుంటూరు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు అర్ధరాత్రి వరకు వివిధ రకాల పరీక్షలను కొనసాగించారు. మొత్తం 18 రకాల వైద్య పరీక్షలు చేయాలని నిర్ణయించారు. అనంతరం ఆస్పత్రిలోని నాట్కో క్యాన్సర్ విభాగంలో రఘురామను ఉంచారు. వైద్యపరీక్షల తర్వాత రమేష్ ఆస్పత్రికి తరలించాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు ఈ రెండు ఆస్పత్రుల నుంచి సీఐడీ కోర్టు నివేదికలు కోరింది. హైకోర్టు ఆదేశాల మేరకు రఘురామ గాయాలపై మెడికల్ బోర్డు నుంచి నేడు ఉన్నత న్యాయస్థానానికి నివేదిక అందించనున్నారు. ఇవాళ రఘురామ తరఫున సుప్రీంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.
ఇదీ చదవండి
ఎంపీ రఘురామ ఒంటిపై దెబ్బలు-పోలీసులు కొట్టినట్లు తేలితే.. తీవ్ర పరిణామాలు ఉంటాయన్న హైకోర్టు