ఎంపీ రఘురామ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు తాజా తీర్పుతో ఆయనను గుంటూరు జిల్లా జైలు నుంచి సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రఘురామరాజు తరలింపునకు సంబంధించి బాధ్యతలను పర్యవేక్షిస్తారు. రవాణా, భద్రతకు సంబంధించి సీఎస్ ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. తరలింపు ఆదేశాలు తక్షణమే అమలవుతాయని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఇవాళ రఘురామరాజును గుంటూరు జిల్లా జైలు నుంచి తరలించనున్నారు.
సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి ఎంపీ రఘురామ..ఏర్పాట్లు చేస్తున్న అధికారులు - MP Raghuram shifted to Secunderabad Army Hospital latest news
సుప్రీం తీర్పుతో ఎంపీ రఘురామకృష్ణరాజును గుంటూరు జిల్లా జైలు నుంచి సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి ఎంపీ రఘురామ