రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకే అమరావతి రైతుల పేరిట కొందరితో చంద్రబాబు పాదయాత్ర చేయిస్తున్నారని వైకాపా ఎంపీ నందిగం సురేశ్ ఆరోపించారు. చంద్రబాబు.. తన బినామీలు కొందరిని రెచ్చగొట్టి పాదయాత్ర ద్వారా తిరుపతి తీసుకెళ్తున్నారని వ్యాఖ్యానించారు. పాదయాత్రలో ఏవైనా గొడవలు జరిగితే.. దానికి చంద్రబాబే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
అమరావతి పాదయాత్ర చేస్తున్నది.. చంద్రబాబు బినామీలే : ఎంపీ - yscp comments on amaravathi maha padayathra
చంద్రబాబు బినామీలు.. అమరావతి రైతుల పేరిట పాదయాత్ర చేస్తున్నారని ఎంపీ నందిగం సురేశ్ ఆరోపించారు. పాదయాత్రలో ఏవైనా గొడవలు జరిగితే.. దానికి చంద్రబాబే బాధ్యత వహించాలన్నారు.
mp nandhigam suresh
ప్రజలపై కక్ష తీర్చుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు బినామీలు మాత్రమే అమరావతి ఏకైక రాజధానుగా ఉండాలని కోరుకుంటున్నారన్నారు. బద్వేలు ఎన్నికల్లో ఫలితాలతో చంద్రబాబుకు వణుకు వస్తోందన్నారు. బద్వేలులో ఓడింది భాజపా మాత్రమే కాదని.. తెదేపా, జనసేన కూడా ఓడాయన్నారు. చంద్రబాబు తెర వెనుక ఉంటూ.. భాజపాకు 20వేల ఓట్లు వేయించారని, ఎన్నికలకు వెళ్లనంటూనే భాజపాకు పవన్ కళ్యాణ్ మద్దతు పలికారని నందిగం సురేశ్ ఆరోపించారు.
ఇదీ చదవండి: