ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం: మోపిదేవి - Guntur district latest news

ముంపు ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామని ఎంపీ మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా రేపల్లే మండలంలో ఆయన పర్యటించారు. వరద బాధితులను పరామర్శించారు. బాధితులకు నిత్యావసర సరకులు అందజేశారు.

MP Mopidevi visit Flood Effected Area
మోపిదేవి

By

Published : Sep 29, 2020, 11:48 PM IST

వరద ముంపు ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు తెలిపారు. గుంటూరు జిల్లా రేపల్లె మండలంలో వరద ముంపు గ్రామాల్లో ఎంపీ పర్యటించారు. పల్లెపాలెం గ్రామంలోని వరద బాధితులను పరామర్శించి... నిత్యావసర సరకులు అందజేశారు.

గత ప్రభుత్వంలో సాగుకు నీరు లేక రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని... రాష్ట్రంలో కరవు పెరిగి రైతులు నష్టపోయారని మోపిదేవి పేర్కొన్నారు. వరద ప్రభావానికి గురైన పల్లెపాలెం ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపుతామని... అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని మోపిదేవి భరోసా ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details