ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్నికల కమిషనర్‌ తీరు సరికాదు:ఎంపీ మోపిదేవి వెంకటరమణ - ఎస్​ఈసీ నిమ్మగడ్డపై మండిపడ్డ మోపిదేవి

ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హద్దులు దాటి వ్యవహరిస్తున్నారని.. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ రావు విమర్శించారు. స్ధానిక ఎన్నికలను ఎస్​ఈసీ వివాదాస్పదం చేస్తున్నారని, ప్రజలు ప్రశాంతంగా ఉంటే చూడలేక గొడవలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మంత్రి పెద్దిరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ.. నిమ్మగడ్డ డీజీపీకి లేఖ రాయడం దారుణమన్నారు.

mp mopidevi venkataramana fires on sec nimmagadda about taking actions on minister peddireddy ramachandraraeddy
ఎన్నికల కమిషనర్‌ తీరు సరికాదు:ఎంపీ మోపిదేవి వెంకటరమణ

By

Published : Feb 7, 2021, 8:46 AM IST

ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తీరు సరిగా లేదని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు విమర్శించారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగానే ఫలితాలు వస్తాయన్నారు. గ్రామాభివృద్ధి కోసం.. గ్రామస్థులంతా పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుంటుంటే కమిషనర్‌కు, చంద్రబాబుకు కడుపు మంటగా ఉందన్నారు. గతంలో స్థానిక ఎన్నికలంటే గొడవలు చోటుచేసుకునేవని, ఈ సారి ఆ పరిస్థితి లేదన్నారు. ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయన్నారు. కానీ, కమిషనర్‌ వివాదాస్పదం చేస్తున్నారని, ప్రజలు ప్రశాంతంగా ఉంటే చూడలేక గొడవలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ప్రజావ్యతిరేక నిర్ణయాలతో గౌరవం పోతోంది

ఈ ఎన్నికల తరువాత జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను సైతం ఇలాగే వివాదాస్పదం చేయడం ఖాయమన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవికి గౌరవం ఉందని, కానీ కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌ తీసుకొంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలతో ఆ గౌరవం పోతోందన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని.. ఎన్నికలు ముగిసే వరకు గృహ నిర్బంధం చేయమని ఆదేశించే హక్కు ఆయనకు ఎవరిచ్చారని మోపిదేవి ప్రశ్నించారు. గుంటూరు, చిత్తూరు జిల్లాలో ఏకగ్రీవాలకు అడ్డుపడేలా హుకుం జారీ చెయ్యడం సరికాదన్నారు.

ఇదీ చదవండి:ఎస్​ఈసీ ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించిన మంత్రి పెద్దిరెడ్డి ​

ABOUT THE AUTHOR

...view details