గుంటూరు జిల్లా రెపల్లెలోని వైకాపా కార్యాలయంలో జగనన్నతోడు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ హాజరయ్యారు. స్త్రీ నిధి బ్యాంక్ ద్వారా అర్హులైన చిరు వ్యాపారస్థులకు రూ.10 వేల చొప్పున వడ్డీ లేని రుణాలను అందజేశారు. రేపల్లె నియోజకవర్గంలో రెండో విడతలో మెుత్తం 2 వేల 490 మంది లబ్ధిదారులకు గాను 2 కోట్ల 49 లక్షల రూపాయలను స్త్రీ నిధి బ్యాంకు ద్వారా మంజూరు చేసినట్లు తెలిపారు. చిరు వ్యాపారుల కష్టాలు చూసి సీఎం జగన్ ఆర్థికంగా ఆదుకోవాలన్న ఉద్దేశ్యంతో జగనన్న తోడు పథకాన్ని అమలు చేశారన్నారు. కొవిడ్ కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న.. ఇచ్చిన హామీలను తూ.చ తప్పకుండా జగన్ సమయానికి పథకాలు అందజేస్తున్నారన్నారు.
లబ్ధిదారులకు స్త్రీనిధి చెక్కులను అందించిన ఎంపీ మోపిదేవి - గుంటూరు జిల్లా తాజా వార్తలు
గతంలో ఎన్నడూ లేని విధంగా పేద ప్రజలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ అన్నారు. రేపల్లెలోని వైకాపా కార్యాలయంలో నిర్వహించిన జగనన్న తోడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
లబ్ధిదారులకు స్త్రీనిధి చెక్కులను అందించిన మోపిదేవి వెంకటరమణ