రాష్ట్రాభివృద్ధికి వైకాపా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని అన్నారు రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ. ఇలాంటి ప్రభుత్వంపై తెదేపా నేతలు బురద చల్లడం మంచిది కాదని మండిపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం తెదేపా నేతలు రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలంలోనే... ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో 90 శాతానికి పైగా అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని మోపిదేవి అన్నారు. ఎక్కడో జరిగిన సంఘటనలకు ప్రభుత్వ వైఫల్యం అనడం సరికాదన్నారు. రాష్ట్రంలో దళితులు, బీసీలకు రక్షణ లేదని వ్యాఖ్యానించడం చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు.