రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని జలకళ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా రేపల్లె మండలం తుమ్మల గ్రామంలో జలకళ కార్యక్రమాన్ని మోపిదేవి ప్రారంభించారు. సాగునీరు ఇబ్బందిగా ఉన్న ప్రాంతాల్లో భూగర్భ జలాలను వెలికితీసి వ్యవసాయం చేసుకునేలా ఉచిత బోర్లు వేయనున్నట్లు తెలిపారు. మెట్ట ప్రాంతాల్లో రైతులు లక్షల రూపాయలు ఖర్చుపెట్టి బోర్లు వేసే పరిస్థితి ఉందన్నారు.
జలకళ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ మోపిదేవి - Jala Kala program in Repalle
గుంటూరు జిల్లా రేపల్లె మండలం తుమ్మల గ్రామంలో జలకళ కార్యక్రమాన్ని ఎంపీ మోపిదేవి వెంకటరమణ ప్రారంభించారు. రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడకుండా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ ఈ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చూట్టారని మోపిదేవి వ్యాఖ్యానించారు. రేపల్లె మండలంలో మొత్తం 24 బోర్లు మంజూరైనట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడకుండా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ ఈ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చూట్టారని మోపిదేవి వ్యాఖ్యానించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక బోరు వేసే యంత్రం అందుబాటులో ఉంటుందన్నారు. కనీసం ఒక హెక్టారు పంటభూమి ఉన్న రైతులు బోర్ల కోసం సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. ఎస్సీ, ఎస్టీలకు బోర్, మోటార్ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. వ్యవసాయంతో పాటు తీర ప్రాంతంలో ఆక్వా సాగుకు ఉపయోగపడేలా పథకం ప్లాన్ చేశామని చెప్పారు. రేపల్లె మండలంలో మొత్తం 24 బోర్లు మంజూరైనట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండీ... హోలీ ప్రత్యేకం.. ఇక్కడ మగాళ్లు.. మగువల్లా సింగారించుకుంటారు