స్వార్థ రాజకీయాల కోసం వైకాపా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బురద జల్లుతున్నాయని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ అన్నారు. రాష్ట్రంలో ఏ దురదృష్టకరమైన ఘటన జరిగినా తెదేపా నేతలు.. వైకాపాపై రుద్దడం ఆనవాయితీగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా రేపల్లె మండలం అరవపల్లి గ్రామంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.
ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బురద జల్లుతున్నాయ్: ఎంపీ మోపిదేవి వెంకట రమణ - ప్రొద్దుటూరు ఘటనపై మోపీదేవి వ్యాఖ్యలు
రాష్ట్రంలో ఏ దురదృష్టకరమైన ఘటన జరిగినా తెదేపా.. వైకాపాపై ఆరోపణలు చేస్తోందని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ అన్నారు. రాష్ట్రాభివృద్ధిని తెదేపా అడ్డుకోవాలని చూస్తోందని ఆరోపించారు.

ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ మోపీదేవి
చాలా మంది అర్హులలైన అభ్యర్థులకు ఇళ్ల స్థలాలు రాకపోవడంపై మహిళలు అసహనం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఎంపీ.. అర్హులందరికీ ఇళ్ల పట్టాలు వచ్చేలా చూస్తామని అన్నారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవాలని ప్రతిపక్ష నేతలు ప్రయత్నించడం బాధాకరమని మోపిదేవి వ్యాఖ్యానించారు.
ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ మోపీదేవి