గుంటూరు జిల్లా పల్నాడు వాసులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులో వచ్చేలా పిడుగురాళ్ల మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఎంపీ లావు కృష్ణదేవరాయలు అన్నారు. వర్చువల్ విధానంలో ఆయన కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన సీఎంకు ధన్యావాదాలు తెలిపారు. పల్నాడు ప్రాంతం మెడికల్ సదుపాయాలకు ఆమడ దూరంలో ఉందని... ఇటీవల వినుకొండకు చెందిన లేడీ కానిస్టేబుల్ సకాలంలో వైద్యం అందక ప్రాణాలు విడిచిందని ఆయన గుర్తుచేశారు. ఇలాంటి పరిస్థితులను మారుస్తూ ఈ మెడికల్ కళాశాలను నిర్మించటం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు. వైద్య కళాశాలతో వైద్య విద్య చేరువ అవుతుందని… మంచి వైద్యులను తయారుచేసుకోవచ్చని తెలిపారు. వైద్య సిబ్బందితో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేసుకోవచ్చునని అన్నారు. అలాగే ఇటీవల మాచర్ల ప్రభుత్వాసుపత్రిని 100 పడకలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని.. అలాగే వినుకొండ ప్రభుత్వాసుపత్రిని కూడా 100పడకలుగా మార్చాలని.. సీఎంను కోరామని ఆయన వెల్లడించారు.
'వైద్య కళాశాలలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు బలోపేతం' - పిడుగురాళ్ల మెడికల్ కళాశాల తాజా వార్తలు
గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో మెడికల్ కళాశాల నిర్మాణానికి సీఎం జగన్ వర్చువల్ ద్వారా శంకుస్థాపన చేశారు. వైద్య కళాశాలతో వైద్య విద్య చేరువ అవుతుందని… మంచి వైద్యులను తయారుచేసుకోవటంతోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేసుకోవచ్చునని ఎంపీ లావు కృష్ణదేవరాయలు అన్నారు.

పిడుగురాళ్ల మెడికల్ కళాశాల శంకుస్థాపనపై ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఆనందం