ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నరసరావుపేట ఆసుపత్రిని సందర్శించిన ఎంపీ, ఎమ్మెల్యే - MLA Gopireddy Srinivasareddy latest news

నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. వైద్యుల పనితీరు, వారు అందిస్తున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

 ఎమ్మెల్యే ,ఎంపీ
mp , mla visits govrnment hospital

By

Published : Apr 27, 2021, 7:13 PM IST

ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలను సందర్శించారు. ఆసుపత్రిలో వైద్యశాలలో కరోనా చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. వారి ఆరోగ్య వివరాలను వైద్యలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 202 మంది కరోనా చికిత్స పొందుతుండగా వారిలో 45 మందికి అత్యవసర చికిత్స, మిగిలిన వారికి ఆక్సిజన్ అవసరం కాగా అందిస్తున్నామని వైద్యులు వివరించారు. అదేవిధంగా వైద్యశాలలో ఇంకా అవసరమైన రెమిడిసివిర్, ఆక్సిజన్ లు త్వరగా అందుబాటులోకి తీసుకువస్తామని ఎంపీ, ఎమ్మెల్యే లు వైద్యులకు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details