గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం మద్దిరాల గ్రామంలో ఆరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన.. జనతా బజార్ కొత్త భవనాన్ని ఎంపీ కృష్ణదేవరాయలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కరోనా లాక్డౌన్ సమయంలో ప్రజలకు అండగా ఉంటూ ఆరా ఫౌండేషన్ అధినేత మస్తాన్ నిర్వహిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. కరోనా వ్యాప్తి ఎక్కువుగా ఉన్న సమయంలో.. ప్రజలు నిత్యావసరాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా, చౌక ధరలలో సరకులు లభించే విధంగా ఈ బజార్ ఏర్పాటు చేయటాన్ని ఆయన అభినందించారు. కొవిడ్ సోకకుండా ఉండకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆరా పౌండేషన్ అధ్యక్షులు మస్తాన్ పాల్గొన్నారు.
జనతా బజార్ నూతన భవనాన్ని ప్రారంభించిన ఎంపీ కృష్ణదేవరాయలు
గుంటూరు జిల్లా మద్దిరాల గ్రామంలో ఆరా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన జనతా బజార్ నూతన భవనాన్ని నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు ప్రారంభించారు. ప్రజలకు అండగా ఉంటూ ఆరా ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని ఎంపీ అన్నారు.
జనతా బజార్ నూతన భవనాన్ని ప్రారంభించిన ఎంపీ కృష్ణదేవరాయలు