Kanakamedala Complaints to Amith Shah: సంకల్ప సిద్ది కేసు వ్యవహారంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఫిర్యాదు చేశారు. వివిధ స్కీముల పేరుతో ఏపీ, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల ప్రజలను కొల్లగొట్టారని పేర్కొన్నారు. తక్కువ కాలంలో రెట్టింపు డబ్బులు చెల్లిస్తామని మోసగించి.. వందల కోట్లు వసూలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో వైసీపీకి చెందిన కీలక నేతల హస్తం ఉందని ఆరోపించారు. వైసీపీ నేతల మోసానికి పేద, మధ్యతరగతికి చెందిన వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. పేదల డబ్బు తిరిగి ఇప్పించేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కేసుపై సమగ్ర విచారణ జరిపించి నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని,.. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
సంకల్ప సిద్ది కేసులో వైసీపీ నేతల హస్తం.. అమిత్ షాకు ఎంపీ కనకమేడల ఫిర్యాదు - అమిత్ షాకు కనకమేడల ఫిర్యాదు
kanakamedala Complaints to Amith shah: సంకల్ప సిద్ది కేసు వ్యవహారంలో వివిధ స్కీముల పలు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల ప్రజలను కొల్లగొట్టారని పేర్కొన్నారు. తక్కువ కాలంలో రెట్టింపు డబ్బులు చెల్లిస్తామని మోసగించి వందల కోట్లు వసూలు చేశారని చేశారు. టీడీపీ ఎంపీ కనకమేడల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై సమగ్ర విచారణ జరిపి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఎంపీ కనకమేడల