కరోపై ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ మండిపడ్డారు. వైరస్ కట్టడికి తన ఎంపీ లాడ్స్ నుంచి రెండున్నర కోట్లు విడుదల చేసినా... సద్వినియోగం చేసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో నర్సింగ్ సిబ్బంది ఆందోళన చేస్తున్న ఘటన తన దృష్టికి వచ్చిందని.. వెంటనే వాళ్ల సమస్యలను పరిష్కరించాలన్నారు. ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కూడా లేవంటూ నర్సులు విధులు బహిష్కరించడం బాధాకరమన్నారు.
'కనీస సదుపాయాలు లేవంటూ నర్సులు విధులు బహిష్కరించడం బాధాకరం'
కరొనా వైరస్ కట్టడికి ఎంపీ లాడ్స్ నుంచి రెండున్నర కోట్ల రూపాయలు విడుదల చేసినా... సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో నర్సింగ్ స్టాఫ్ ఆందోళన చేస్తున్న ఘటన తన దృష్టికి వచ్చిందని.. వెంటనే స్టాఫ్ నర్స్‌ల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వం నిధులు సద్వినియోగం చేసుకోవడంలో విఫలం