అమరావతి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రైతులకు సూచించారు. తుళ్లూరులో ఎంపీ గల్లా జయదేవ్ రైతులతో సమావేశమయ్యారు. మలిదశ ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే అంశంపై చర్చించారు. అనంతవరం గ్రామంలో మృతి చెందిన రైతు సాంబశివరావుకు ఎంపీతో పాటు రైతులు నివాళులర్పించారు. రైతుల సమస్యలను త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తానని ఎంపీ స్పష్టం చేశారు. కరోనా నిబంధనలను పాటిస్తూనే ఉద్యమాలు చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయస్థానాలతో దాదాపు 60 సార్లు మొట్టికాయలు వేయించుకుందని ఎద్దేవా చేశారు.
అమరావతి మలిదశ ఉద్యమంపై ఎంపీ చర్చలు - గుంటూరు జిల్లా తాజా వార్తలు
తుళ్లూరులోని రైతులతో ఎంపీ గల్లా జయదేవ్ సమావేశమయ్యారు. మలిదశలో అమరావతి ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే అంశంపై చర్చించారు. చనిపోయిన రైతుకు ఆయన నివాళులర్పించారు.

అమరావతి మలిదశ ఉద్యమంపై ఎంపీ గల్లా జయదేవ్ చర్చలు