ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 2, 2020, 4:02 PM IST

ETV Bharat / state

పారిశుద్ధ్య సిబ్బందిని సన్మానించిన ఎంపీ అయోధ్యరామిరెడ్డి

గుంటూరు జిల్లా పెదకాకాని మండలం పెదకాకాని గ్రామంలో శుక్రవారం స్వచ్ఛ భారత్​పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో స్వచ్ఛ కాకాని మండలానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి కోరారు.

పారిశుద్ధ్య సిబ్బందిని సన్మానించిన ఎంపీ అయోధ్యరామిరెడ్డి
పారిశుద్ధ్య సిబ్బందిని సన్మానించిన ఎంపీ అయోధ్యరామిరెడ్డి

గుంటూరు జిల్లాలోని పెదకాకానిలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పెదకాకాని ర్యాలీలో ఎంపీ అయోధ్యరామిరెడ్డి పాల్గొన్నారు. చదువు , ఆరోగ్యం, పరిశుభ్రత అనే మూడు అంశాలపై అందరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు.

పది గ్రామాలు ఎంపిక..

వాటిని పాటిస్తే స్వచ్ఛభారత్ సాధించవచ్చని పేర్కొన్నారు. స్వచ్ఛభారత్ రెండో దశలో మండల పరిధిలో సుమారు పది గ్రామాలు ఎంపికయ్యాయని స్థానిక ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య వివరించారు. పరిశుభ్రత కార్యక్రమాలకు రాంకీ ఫౌండేషన్ తమ వంతు సహకారం అందించడం అభినందనీయమన్నారు.

మీ సేవలు అసమానం..

అనంతరం పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. పారిశుద్ధ్య కార్మికులవి వెలకట్టలేని సేవలని కీర్తిస్తూ ప్రతి కార్మికునికి ఎంపీ అయోధ్యరామిరెడ్డి పాదాభివందనం చేశారు.

ఇవీ చూడండి : సచివాలయ సిబ్బందిని చప్పట్లతో అభినందించండి: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details