ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'దిల్లీ ప్రార్థనకు వెళ్లినవారిని ఐసోలేషన్​కు తరలిస్తున్నాం'

లాక్​డౌన్ నేపథ్యంలో నిరాశ్రయులైన వలస కూలీల కోసం గుంటూరులో ఏర్పాటు చేసిన శిబిరాన్ని దక్షిణ కోస్తా ఐజీ ప్రభాకరరావు సందర్శించారు. అక్కడ ఏర్పాట్ల గురించి ఆరా తీశారు. దిల్లీలో మతపరమైన ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలిస్తున్నామని ఐజీ స్పష్టం చేశారు.

దిల్లీలో ప్రార్థనలకు హాజరైన వారిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలిస్తున్నాం
దిల్లీలో ప్రార్థనలకు హాజరైన వారిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలిస్తున్నాం

By

Published : Mar 31, 2020, 11:44 AM IST

దిల్లీలో ప్రార్థనలకు హాజరైన వారిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలిస్తున్నాం

దిల్లీలో మతపరమైన ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలిస్తున్నామని దక్షిణ కోస్తా ఐజీ ప్రభాకరరావు స్పష్టం చేశారు. వారితో కలిసిన వారిని గుర్తించి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. లాక్​డౌన్ నేపథ్యంలో నిరాశ్రయులైన వలస కూలీలకు గుంటూరులో ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఆయన సందర్శించారు. వారికి అల్పాహారం, దుప్పట్లు పంపిణీ చేసి, స్వీయ క్రమశిక్షణ, సామాజిక దూరం పాటించాలని సూచించారు. విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన 2 వేల 600 మందిని క్వారంటైన్​ కేంద్రాలకు పంపించామని ఐజీ వెల్లడించారు. ఇంకా చిరునామాలు దొరకని 85 మంది కోసం గాలిస్తున్నామన్నారు. కుటుంబం, సమాజ శ్రేయస్సు దృష్ట్యా వీళ్లు ఎక్కడ ఉన్నా క్వారంటైన్ కేంద్రాలకు రావాలని ఐజీ విజ్ఞప్తి చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details