గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడులో సినిమా షూటింగ్ సందడి నెలకొంది. గ్రామం సమీపంలోని గోపీనాథ స్వామి ఆలయం కత్తుల బావి వద్ద చిత్రీకరణ జరుగుతోంది. స్కందాగ్రజ క్రియేషన్స్పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
కొండవీడులో సినిమా చిత్రీకరణ... చూసేందుకు తరలివస్తున్న ప్రజలు - కొండవీడు గోపీనాథ స్వామి ఆలయంలో సినిమా చిత్రీకరణ
స్కందాగ్రజ క్రియేషన్స్ నూతన చిత్ర షూటింగ్.. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడులో జరుగుతోంది. తమ సినిమా చిత్రీకరణకు ఈ ప్రాంతం అనువుగా ఉంటుందని భావించి.. షూటింగ్ ప్రారంభించినట్లు దర్శకుడు తెలిపారు. చిత్రీకరణ చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలి వస్తున్నారు.
కొండవీడులో జరుగుతన్న సినిమా చిత్రీకరణ
కొండవీడు ప్రాంతం పర్యటకంగాను, షూటింగులకు అనువుగా ఉంటుందని చిత్ర దర్శకుడు అంచుల నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. అందుకే తమ సినిమా షూటింగ్ ఇక్కడ ప్రారంభించినట్లు తెలిపారు. మూడు రోజులపాటు ఈ ప్రాంతంలోనే చిత్రీకరణ జరుగుతుందన్నారు. పరిసర గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చి.. షూటింగ్‌ను ఆసక్తిగా తిలకిస్తున్నారు.
ఇదీ చదవండి:నాగులచవితి రోజున ఆసక్తికర ఘటన