లక్షల రూపాయలు వెచ్చించి గుంటూరు జిల్లా చేబ్రోలులో నిర్మించిన మాతాశిశు కేంద్రాన్ని.. రోడ్లు, భవనాల శాఖ అధికారులు కూల్చివేశారు. ప్రధాన రహదారి వెంట అక్రమ నిర్మాణాల తొలగింపులో భాగంగా.. పోలీసులు, రెవెన్యూ, ఆర్అండ్బీ అధికారులు కలిసి ఈ చర్యలు తీసుకున్నారు.
సుమారు ఐదు లక్షలు వెచ్చించి కట్టిన కేంద్రాన్ని పూర్తిగా నేలమట్టం చేశారు. ప్రతినెలా గర్భిణులు, బాలింతలకు పోషకాహారాన్ని అందజేసేందుకు ఆవాసం లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.