ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమ్మ అమ్మేనంటూ నిరూపించుకుంది ఆ తల్లి - గుంటూరు జిల్లా వార్తలు

Mother Love: కర్కశత్వం చూపిన కుమారుడిపై ఆ వృద్ధ తల్లి కన్న మమకారాన్ని చాటింది. అమ్మ అమ్మేనంటూ నిరూపించింది.గుంటూరు జిల్లా తాడేపల్లిలోని బ్రహ్మానందపురంలో వృద్ధురాలైన తల్లిపై కుమారుడు విచక్షణారహితంగా కొట్టినప్పటికీ... తన కుమారుడిపై కేసుపెట్టొదంటూ ఆ తల్లి.. తన ప్రేమను చాటుకుంది.

Mother Love
Mother Love

By

Published : Feb 20, 2022, 7:19 AM IST

Updated : Feb 20, 2022, 10:28 AM IST

Mother Love: కర్కశత్వం చూపిన కుమారుడిపై ఆ వృద్ధ తల్లి కన్న మమకారాన్ని చాటింది. నవమోసాలు మోసిన బిడ్డకు ఎక్కడ కష్టాలు వస్తాయోనని తల్లడిల్లింది. అమ్మ అమ్మేనంటూ నిరూపించింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని బ్రహ్మానందపురంలో తన తల్లి వృద్ధురాలైన నాగమణిని కుమారుడు శేషు విచక్షణారహితంగా కొట్టిన ఘటన అందరినీ కలచివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ శనివారం ఆర్డీవో భాస్కరరెడ్డి, తహసీల్దార్‌ శ్రీనివాసులురెడ్డితో కలిసి నాగమణి ఇంటికి వెళ్లారు. వృద్ధురాలిని పరామర్శించారు. శేషుపై కేసు పెడదామా? అంటూ వాసిరెడ్డి పద్మ వృద్ధురాలిని ప్రశ్నించగా.. ‘వద్దు, వద్దమ్మా.. నన్ను బాగా చూసుకోమని చెప్పండి చాలు’ అంటూ అమ్మ ప్రేమను చాటుకుంది. ఈ సంఘటనను సుమోటోగా తీసుకొని ఆర్డీవో విచారణ జరుపుతారని ఛైర్‌పర్సన్‌ పద్మ తెలిపారు.

అసలేం జరిగిందంటే..?

గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన శేషు.. వృద్ధాప్యంలో అమ్మ ఆలనాపాలనా చూసుకోవాల్సింది పోయి.. చిత్ర హింసలకు గురి చేశాడు. తల్లి పేరిట ఉన్న ఆస్తిని రాసివ్వాలంటూ.. భార్యతో కలిసి నిత్యం నరకం చూపించాడు. దెబ్బలకు తాళలేక విలపిస్తున్న తల్లిపై ఏ మాత్రం కనికరం చూపక.. కర్రతో చితక బాదాడు. స్థానికులు ఈ దృశ్యాలను సెల్‌ఫోన్​లో రికార్డు చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కర్కశ కుమారుడ్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో తన కొడుకుపై కేసుపెట్టొదంటూ నాగమణి... అమ్మ ప్రేమను చాటుకుంది.

ఇదీ చదవండి:Cruel Son: ఆస్తి కోసం కొడుకు కర్కశత్వం..తల్లిని కర్రతో కొడుతూ.. కాలితో తన్నుతూ

Last Updated : Feb 20, 2022, 10:28 AM IST

ABOUT THE AUTHOR

...view details