గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో గత నెల 25న ధరణి మహేశ్వరి అనే మహిళ ప్రసవించింది. ఆమెకు ఆడపిల్ల జన్మించింది. వైద్య సేవలు తీసుకున్న అనంతరం ఈ నెల 10న పుట్టిన బిడ్డను ఆసుపత్రిలో వదిలేసి వెళ్లిపోయిందా తల్లి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రిలో చేరే సమయంలో మహేశ్వరీ ఇచ్చిన చిరునామాతో ఆమెను గుర్తించే ప్రయత్నం చేశారు. అ వివరాలు తప్పని తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది.. ఆమె కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం పసిపాప ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు.
తెనాలిలో ఆడపిల్ల పుట్టిందని వదిలేసి వెళ్లిపోయిన తల్లి - tenali hospital latest news
తెనాలి ప్రభుత్వాసుపత్రిలో పుట్టిన పసికందును వదిలి వెళ్లిపోయిందో తల్లి. ఈ హృదయవిదారక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తెనాలి ఆసుపత్రిలో పసికందును వదిలివెళ్లిన తల్లి