అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన వృద్ధురాలు కొవిడ్‌తో మరణించిందని తెలియగానే ఆమె ఒంటిపై ఆభరణాలు తీసుకున్న కుటుంబసభ్యులు మృతదేహానికి అంత్యక్రియలు విస్మరించారు. గుంటూరు జిల్లా మాచర్ల మండలానికి చెందిన ఓ వృద్ధురాలు ఇటీవల మనుమరాలి వద్దకు వచ్చింది. శ్వాస సమస్యతో ప్రభుత్వాసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయింది.
తల్లి ఆభరణాలు తీసుకెళ్లారు.. అంత్యక్రియలపై మౌనంగా ఉన్నారు!
కరోనా ప్రభావం... కుటుంబ సంబంధాలను మంటగలుపుతోంది. అమ్మానాన్నా అన్న తేడా లేకుండా.. జనాలు వ్యవహరిస్తున్నారు. తమకు ఎక్కడ వైరస్ సోకుతుందో అన్న భయంతో.. కన్నవాళ్లను సైతం నిర్దాక్షిణ్యంగా వదిలేస్తున్నారు. గుంటూరులో ఇలాంటి అమానవీయ ఘటనే జరిగింది. కరోనా కారణంగా మరణించిన తల్లి శరీరంపై నగలు తీసుకున్న పిల్లలు.. అంత్యక్రియలపై మాత్రం స్పందించకపోవడం.. తాజా పరిస్థితిని చెప్పకనే చెబుతోంది.
mother died due to corona.. family taken jewelry but not took the body
వృద్ధురాలికి కొవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. ఆమెకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆమె ఒంటిపై బంగారు ఆభరణాలు, చేతికి ఉంగరాలు తీసుకెళ్లిన వారు.. అంత్యక్రియల గురించి అధికారులు, పోలీసులు అడిగినా సోమవారం సాయంత్రం వరకూ పట్టించుకోలేదు. వారు ఫోన్లు స్విఛ్చాఫ్ చేయడంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.