గుంటూరు జిల్లా న్యూజెండ్ల మండలం వి.అప్పాపురం గ్రామంలో గొర్రెల మంద మేత కోసం వెళ్లినప్పుడు ఆ గుంపులో జింక పిల్ల కలిసిపోయింది. ఇంటికి వచ్చాక గొర్రెల కాపరులు ఆ జింక పిల్లను గమనించారు. దానికి మేత పెట్టారు. అయితే జింక పిల్లను వెదుక్కుంటూ తల్లి జింక గ్రామంలోకి రావడంతో.. కుక్కలు వెంబడించాయి. కుక్కల దాడిలో జింకకు గాయాలయ్యాయి.
పిల్ల కోసం గ్రామానికి వచ్చిన తల్లి జింక…కుక్కల దాడి
గుంటూరు జిల్లా న్యూజెండ్ల మండలం వి.అప్పాపురం గ్రామంలో దారి తప్పిపోయి గొర్రెల మందలో కలిసి ఓ పిల్ల జింక గ్రామానికి వచ్చింది. పిల్లను వెతుకుంటూ ఊర్లోకి వచ్చిన తల్లి జింకపై కుక్కలు దాడి చేశాయి. గ్రామస్థులు గాయపడిన జింకను కాపాడారు.
పిల్ల కోసం గ్రామానికి వచ్చిన తల్లి జింక…కుక్కల దాడి
గ్రామస్థులు కుక్కలను తరిమి జింకను రక్షించారు. దానికి సపర్యలు చేసి పశువైద్యులకు సమాచారం ఇచ్చారు. అటవీశాఖ అధికారులకు కూడా విషయం తెలిపారు. ప్రస్తుతం జింక ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. బిడ్డకోసం తల్లి అడవుల నుంచి తరలిరావటం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఇవీ చదవండి: మేడికొండూరు మండలంలో పెరుగుతున్న కరోనా కేసులు