ప్రియుడి మోజులో పడి కన్నపిల్లలను చిత్రహింసలకు గురిచేస్తున్న తల్లి ఉదంతమిది. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన ఓ వివాహిత.. భర్తను వదిలిపెట్టి శ్రీను అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. తన మాట వినటం లేదని, ప్రియుడితో ఏకాంతంగా గడపనీయకుండా ఆటంకం కల్పిస్తున్నారన్న ఆగ్రహంతో తన ఎనిమిదేళ్లలోపు కుమారుడు, కుమార్తెలను మేకుల కర్రతో విచక్షణరహితంగా కొట్టి హింసిస్తోంది.
మంగళవారం మరోసారి పిల్లలను కొట్టి ఇంటి నుంచి గెంటివేస్తుండగా స్థానికులు గమనించి వార్డు సచివాలయంలోని మహిళా పోలీసు మరకా జ్యోతికి సమాచారమిచ్చారు. ఆమె ఇంటి వద్దకు వచ్చేసరికి వివాహిత పారిపోయేందుకు ప్రయత్నించింది. ఆమెను స్టేషన్‌లో అప్పగించారు.