కరోనాతో రెండు రోజుల క్రితం ఓ మహిళ గుంటూరు జీజీహెచ్ లో చేరింది. ఆమె 2నెలల బాబుకి కూడా పాజిటివ్ గా తేలింది. అయితే బాబు ఊపిరి పీల్చుకునేందుకు ఇబ్బంది పడుతున్నాడు. వైద్యులు పరిక్షించి నిమ్ము చేరిందని చెప్పారు. ఆ తర్వాత సిబ్బంది వచ్చి.. చూసి ఎలాంటి వైద్యం చేయకుండానే వెళ్లిపోయారు. ఓ వైపు బాబు పరిస్థితి ఆందోళనగా ఉండటంతో ఆ తల్లి.. సెల్ఫీ వీడియో తీసు.. అక్కడి పరిస్థతిని వివరించింది. వైద్యులు ఇప్పటికైనా స్పందించి తన బాబుకి చికిత్స అందించాలని వేడుకుంటోంది.
'నా 2 నెలల బాబుకు కరోనా పాజిటివ్.. కాపాడండి' - గుంటూరు జీజీహెచ్లో సిబ్బంది నిర్లక్ష్యం న్యూస్
గుంటూరు జీజీహెచ్ సిబ్బంది నిర్లక్ష్యంతో బాలింతతో పాటు రెండు నెలల చిన్నారి ఇబ్బందులు పడ్డారు. చిన్నబాబుకు పాజిటివ్ వచ్చినా.. పట్టించుకోకపోయేసరికి ఆ తల్లి విలవిలలాడుతోంది.
mother and 2 months kid facing problems in guntoor ggh