గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరగటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలోని కంటైన్మెంట్ జోన్లలో ఉండే నివాసితులు ఎవరూ బయటకు రాకుండా ఆ ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఏ అవసరం ఉన్నా..గుంటూరు నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన ఆరు కమాండ్ కంట్రోల్ రూములకు ఫోన్ చేసి తెలియజేయాలని నగర కమిషనర్ కోరారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాలవారు అత్యధికంగా నిత్యవసరాలు కావాలని కోరుతూ ఫోన్లు చేస్తున్నారు. ఆ తర్వాత కరోనా అనుమానితులకు సంబంధించిన ఫోన్లు వస్తున్నట్లు సమాచారం. ప్రతి కంటైన్మెంట్ జోన్లో నిత్యావసరాలు, కూరగాయలు విక్రయించాలని నగర కమిషనర్ మార్కెటింగ్ శాఖ అధికారులకు సూచించారు.
కంటైన్మెంట్ జోన్ పరిధిలో నిత్యావసరాలకే అత్యధిక కాల్స్
గంటూరు నగరంలో కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించిన ప్రాంతాల్లో అధికారులు కట్టదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఎవరూ బయటకు రాకుండా నిత్యావసరాలను అధికారులు ఇళ్ల వద్దకే సరఫరా చేస్తున్నారు.
నిత్యవసరాలకే అత్యధిక కాల్స్