గుంటూరు జిల్లా తెనాలిలో కరోనా తీవ్రత రోజు రోజుకి పెరుగుతోంది. ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంవో కరోనా కారణంగా మరణించటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కేవలం తెనాలి పట్టణంలోనే 113 కేసులు నమోదు కాగా మున్సిపల్ కమిషనర్‌కు సైతం కరోనా నిర్ధారణ అయ్యింది. అలాగే మరికొందరు ఉద్యోగులు వైరస్ బారిన పడటం మున్సిపల్ కార్యాలయాన్ని శుద్ధి చేశారు. రెండు రోజుల పాటు కార్యాలయాన్ని మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. సిబ్బందిని కార్యాలయానికి రావొద్దని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 38 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
తెనాలిలో పెరుగుతున్న కరోనా తీవ్రత.. మున్సిపల్ కార్యాలయం మూసివేత - corona cases in tenali latest news
గుంటూరు జిల్లా తెనాలిలో ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంవో కరోనా కారణంగా మరణించటం కరోనా తీవ్రతకు అద్దం పడుతోంది. మున్సిపల్ కమిషనర్‌కు కోవిడ్ నిర్ధారణ కావడం మున్సిపల్ కార్యాలయాన్ని మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో కరోనా కేసుల సంఖ్య 151కు చేరుకుంది.
తెనాలిలో పెరుగుతున్న కరోనా తీవ్రత