కరోనా నివారణ చర్యలపై మంత్రి మోపిదేవి సమీక్ష నిర్వహించారు. గుంటూరు జిల్లాలో కేసులు ఒక్కసారిగా పెరుగుతుండడంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 109 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని మంత్రి తెలిపారు. కరోనా నిరోధానికి ప్రభుత్వంతోపాటు ప్రజల భాగస్వామ్యం అవసరమని మోపిదేవి అన్నారు. వ్యాధి లక్షణాలు లేక తొలుత పరీక్షలకు కొందరు ముందుకు రాలేదని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో 32 క్వారంటైన్ కేంద్రాల్లో 5,190 మంది ఉన్నారని స్పష్టం చేశారు. అన్ని క్వారంటైన్ కేంద్రాల్లో పూర్తి సదుపాయాలు కల్పించామన్న మంత్రి... 14 రోజులు పూర్తయ్యాక ఇంటికి పంపించాలని కొందరు ఒత్తిడి చేస్తున్నారన్నారు. అలాంటివాళ్లు ప్రభుత్వానికి పూర్తిగా సహకరించాలని మంత్రి మోపిదేవి కోరారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో రైతులకు అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. రైతుల పంట కొనుగోలు, గిట్టుబాటు ధరకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
కరోనా నిరోధానికి ప్రజల సహకారం అవసరం: మంత్రి మోపిదేవి - మోపిదేవి వెంకటరమణ తాజా వార్తలు
గుంటూరు జిల్లాలో రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కల్గిస్తోందని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. జిల్లాలో కరోనా నివారణ చర్యలపై సమీక్షించారు. కరోనా నిరోధక చర్యలకు ప్రభుత్వం పాటు ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు.
మంత్రి మోపిదేవి వెంకటరమణ