ఇదేంది సామి.. గణతంత్రమా...స్వాతంత్య్రమా? - independance celebrations repalle
గుంటూరు జిల్లా రేపల్లె మున్సిపల్ కార్యాలయంలో 74 వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అయితే స్వాతంత్య్ర దినోత్సవాన్ని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ గణతంత్ర దినోత్సవంగా పేర్కొనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలోని రేపల్లె మున్సిపల్ కార్యాలయంలో 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణరావు ఆవిష్కరించారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన అన్నారు. అయితే స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఆయన గణతంత్ర దినోత్సవంగా పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడికి స్వాతంత్య్ర దినోత్సవానికి.. గణతంత్ర దినోత్సవానికి తేడా తెలియదా అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.