ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 20, 2020, 4:41 PM IST

ETV Bharat / state

బీసీల అభ్యున్నతికి వైకాపా కృషి చేస్తోంది: ఎంపీ మోపిదేవి

136 బీసీ కులాలకు 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి తీసుకోలేని సాహసోపేత నిర్ణయాన్ని సీఎం జగన్ తీసుకున్నారని రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ ప్రశంసించారు. గత ప్రభుత్వ హయంలో బీసీలను కేవలం ఓటుబ్యాంకు కోసమే వాడుకున్నారని విమర్శించారు.

బీసీల అభ్యున్నతికి వైకాపా కృషి చేస్తోంది
బీసీల అభ్యున్నతికి వైకాపా కృషి చేస్తోంది

బీసీల అభివృద్ధికి వైకాపా ప్రభుత్వం కృషి చేస్తోందని రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా రేపల్లెలో బీసీ కార్పొరేషన్ పాలక మండలిలో డైరెక్టర్లుగా నియమితులైన వారిని ఆయన సన్మానించారు. 136 బీసీ కులాలకు 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి తీసుకోలేని సాహసోపేత నిర్ణయాన్ని సీఎం జగన్ తీసుకున్నారని ప్రశంసించారు. పదవుల్లో 50 శాతం మహిళలకు అవకాశం కల్పించిన ఘనత జగన్​కే దక్కుతుందన్నారు.

బీసీల అభ్యున్నతి కోసం సీఎం జగన్...ఇప్పటివరకు సుమారు 44 వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. గత ప్రభుత్వ హయంలో బీసీలను కేవలం ఓటుబ్యాంకు కోసమే వాడుకున్నారని విమర్శించారు. తెదేపా ప్రభుత్వం బీసీ అభివృద్ధికి ఎలాంటి పథకాలు అమలు చేయలేదన్నారు.

ABOUT THE AUTHOR

...view details