'గిట్టుబాటు ధరలపై బహిరంగ చర్చకు సిద్ధమా..?' - పవన్ వ్యాఖ్యలకు మోపిదేవి కౌంటర్ వార్తలు
రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ... జనసేన అధినేత పవన్ కల్యాణ్ అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి మోపిదేవి వెంకటరమణ మండిపడ్డారు.
!['గిట్టుబాటు ధరలపై బహిరంగ చర్చకు సిద్ధమా..?' mopidevi-react-on-pawan-comments](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5299930-1051-5299930-1575721413863.jpg)
mopidevi-react-on-pawan-comments
రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ... జనసేన అధినేత పవన్ కల్యాణ్ అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి మోపిదేవి వెంకటరమణ మండిపడ్డారు. పవన్ వ్యాఖ్యలు ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. రైతు సమస్యలు, పంట గిట్టుబాటు ధరలపై పవన్ బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.