రాష్ట్రంలో కరోనాను నిర్మూలించేందుకు ముఖ్యమంత్రి జగన్ నిరంతరం అధికారులతో మాట్లాడుతూ.. ముందస్తు చర్యలు తీసుకుంటున్నారని మంత్రి మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా నిజాంపట్నంలోని మహిళ సమాఖ్య కార్యాలయంలో... డ్వాక్రా మహిళలు కుట్టిన లక్ష మాస్క్‌లను నియోజకవర్గంలోని అన్ని పంచాయతీలకు, మండల కార్యాలయాలకు ఆయన పంపిణీ చేశారు. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకే ప్రతి ఒక్కరికి మాస్క్‌లు అందజేయాలని తలచి... పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు.
'జగన్ పరిపాలనను మేధావులు సైతం కొనియాడుతున్నారు' - జగన్ పై మంత్రి మోపిదేవి ప్రశంసలు
కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ సుపరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ను దేశ మేధావులు సైతం కొనియాడుతున్నారని మంత్రి మోపిదేవి వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా నిజాంపట్నంలో మాస్కులు పంపిణీ చేసిన ఆయన... కరోనాను తరమికొట్టేందుకు ప్రభుత్వం శ్రమిస్తుందన్నారు.

'జగన్ పరిపాలనను మేధావులు సైతం కొనియాడుతున్నారు'
డ్వాక్రా మహిళలు మాస్కులు కుట్టడం వల్ల వారికి కొంత మేర ఉపాధి లభించిందన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ హామీ ఇచ్చిన పథకాలను అమలుచేస్తూ... మరో వైపు కొత్త సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ సీఎం జగన్ సురిపాలన సాగిస్తున్నారని ప్రశంసించారు. దేశ మేధావులు సైతం ముఖ్యమంత్రి పరిపాలనా విధానాన్ని కొనియాడుతున్నారన్నారు.