ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"2, 3 రోజుల్లో మహారాష్ట్ర నుంచి ఉల్లి దిగుమతి" - mopi devi meeting on onoin prices at vijayawada

బహిరంగ మార్కెట్లో ఉల్లి ధరలు ఆమాంతం పెరగటంపై మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ.. ఉన్నతాధికారులతో సమీక్షించారు.

"కృత్రిమ కొరత సృష్టిస్తే ఉపేక్షించం"

By

Published : Sep 23, 2019, 6:30 PM IST

ఉల్లి ధరలు పెరగటంపై మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ సమీక్షించారు. ధరలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. కొందరు వ్యాపారులు సరుకును బ్లాక్​ మార్కెట్​కు తరలించారన్న సమాచారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కృత్రిమ కొరత సృష్టించిన వారిని ఉపేక్షించేంది లేదని హెచ్చరించారు. పెద్ద మెుత్తంలో ఉల్లిని నిల్వ చేసినా, బ్లాక్ మార్కెట్​కు తరలించేందుకు ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు స్పష్టం చేశారు. మరో రెండు రోజుల్లో మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసి రైతు బజార్లలో అందుబాటులో ఉంచాలని దిశానిర్దేశం చేశారు. వరదల కారణంగానే ఉల్లి కొరత ఏర్పడిందనీ, పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details