ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరెంటు స్తంభం ఎక్కి... తీగలను కదిలించి...! - electric pole

గుంటూరు జిల్లా కారంపూడి విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఓ కోతి.. జనాన్ని తన చేష్టలతో భయపెట్టింది. కరెంటు స్థంబం ఎక్కి తీగలను కదిలించేందుకు ప్రయత్నిస్తూ అందరినీ ఆందోళనకు గురి చేసింది.

కరెంటు స్థంబం ఎక్కి భయపెట్టిన కోతి

By

Published : Oct 28, 2019, 7:48 PM IST

కరెంటు స్థంబం ఎక్కి భయపెట్టిన కోతి

గుంటూరు జిల్లా గురజాలలో ఓ కోతి కాసేపు అందరినీ భయపెట్టింది. కారంపూడి విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట కరెంటు స్తంభం పైకెక్కి తీగల్ని కదిలించే ప్రయత్నం చేసింది. పావుగంటకు పైగా అక్కడే కూర్చుంది. కోతి తీగల్ని కదిలించి ఉంటే అవి రెండూ తగిలుకుని నిప్పురవ్వలు ఎగిసిపడేవని స్థానికులు భయపడ్డారు. విద్యుత్తు షాక్ తో కోతి చనిపోతుందేమోనని ఫీడర్ అపేయించారు. కోతిని దించేందుకు సిబ్బంది చాలా ప్రయత్నాలు చేశారు. రెండడుగులు దిగడం.. మళ్లీ ఎక్కడం... ఇలా చేస్తూ కోతి కాసేపు హడావుడి సృష్టించింది. కొందరు యువకులు అదిలించగా.. కాసేపటికి దిగి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ABOUT THE AUTHOR

...view details