పాత గుంటూరు హిందూ శ్మశానవాటికలో సాధారణ మృతదేహం దహనానికి రూ.2,200... కొవిడ్ మృతదేహం దహనానికి రూ.5,100 అంటూ నగరపాలకసంస్థ బోర్డులు పెట్టడం వివాదాస్పదమైంది. సామాజిక మాధ్యమాల్లో ఈ విషయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత సమయంలో అంత్యక్రియల కోసం ఇంత మొత్తంలో డబ్బు వసూలు చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. స్పందించిన అధికారులు బోర్డును తీసేశారు. పేద ప్రజలకు ఉచితంగానే అంత్యక్రియలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.