మోదీ ప్రశ్నలకు చురకల్లాంటి సమాధానాలిస్తున్న చంద్రబాబు ధర్నాలు, ఆందోళనల మధ్య గుంటూరులో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సాగింది. వ్యూహాత్మక చమురు నిల్వల కేంద్రాలను ప్రధాని ప్రారంభించారు. ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని గుంటూరు బహిరంగ సభలో ప్రధాని ప్రసంగం సాగింది. మోదీ ప్రశ్నలకు చురకల్లాంటి సమాధానమిచ్చారు చంద్రబాబు. హోదా కంటే ఎక్కువగా ఇచ్చామని మోదీ అంటే.. రాష్ట్రానికి అన్యాయం చేశారని చంద్రబాబు విమర్శించారు. చంద్రబాబు చెప్పే సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అంటే.. తన కుమారుడు లోకేష్‌ను ఉద్ధరించుకోవడమే అని మోదీ అంటే.. కుటుంబ వ్యవస్థపై గౌరవం లేని వ్యక్తి మోదీ అని బాబు వ్యాఖ్యానించారు. మరిన్ని అంశాలపై మోదీ వ్యాఖ్యలకు.. చంద్రబాబు తీవ్రంగా స్పందించిన తీరు.. చర్చనీయాంశమైంది.