ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మోదీ జన్మదిన వేడుకలు... కార్యకర్తల రక్తదానం - kanna laxmi narayana

గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ హాజరై... కేక్​ కట్​ చేశారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

మోదీ జన్మదిన వేడుకలు

By

Published : Sep 17, 2019, 11:24 PM IST

మోదీ జన్మదిన వేడుకలు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా... ప్లాస్టిక్ రహిత ఉపయోగాలపై కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు... భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో నిర్వహించిన మోదీ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... మోదీ బర్త్​డే వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా వారంరోజుల పాటు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈనెల 14న ప్రారంభించామని... 20వరకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని కన్నా చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details