ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనాతో ఉపాధ్యాయురాలు మృతి.. భయంలో విద్యార్థులు! - గుంటూరు జిల్లాలో కరోనాతో ఉపాధ్యాయురాలు మృతి న్యూస్

గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఈపురులో ఏపీ మోడల్ స్కూల్ (టీజీటీ ఇంగ్లీష్) ఉపాధ్యాయురాలు కె. సుబ్బలక్ష్మీ కరోనా బారిన పడి మృతి చెందారు. దీంతో తోటి సిబ్బంది, విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.

model school teacher died with corona in gunturu district
model school teacher died with corona in gunturu district

By

Published : Apr 18, 2021, 5:24 PM IST

గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఈపురులో ఏపీ మోడల్ స్కూల్ (టీజీటీ ఇంగ్లీష్) ఉపాధ్యాయురాలు కె. సుబ్బలక్ష్మీ ఈ నెల 10వ తేదీన కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు 15వ తేదీన మోడల్ స్కూల్ విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. 53 మంది విద్యార్థుల్లో ఐదుగురికి కరోనా సోకినట్లు వైద్యులు గుర్తించారు. కానీ అధికారులు ఎటువంటి జాగ్రత్తలు పాటించకుండా కేవలం స్కూల్​లో శానిటైజ్​ చేసి తరగతులు కొనసాగిస్తున్నారు.

శనివారం ఉపాధ్యాయురాలు మృతి చెందడంతో విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులు భయాందోళనలో ఉన్నారు. ఈ సంఘటనపై డీఈఓ ఆఫీస్ నుంచి ఎటువంటి సమాచారం రాలేదని, వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఈపూరు ఎంఈఓ తెలియజేశారు.

ఇదీ చదవండి:కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి: టికాయత్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details