ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Fish Farming: చేపల పెంపకంలో సరికొత్త టెక్నాలజీ - Model Fish Forming by CA completed young farmer

ఉన్నత చదువులు చదివిన ఆ యువకుడు.. కొత్తగా ఏదైనా చేయాలని ఆలోచించారు. సాగుకు సాంకేతికతను జోడించి ఉత్తమ ఫలితాలు రాబడుతున్నారు. ఆధునిక పద్ధతుల్లో.. తక్కువ నీరు, తక్కువ విస్తీర్ణంతో పెద్దసంఖ్యలో చేపలు పెంచుతూ అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. ఇంతకీ.. అతను అనుసరిస్తున్న విధానాలేంటి? వాటిని ఎలా సాధ్యం చేశారో చూద్దాం..

సత్యదేవ్‌రాజు, సిరి ఆక్వాఫామ్స్
సత్యదేవ్‌రాజు, సిరి ఆక్వాఫామ్స్

By

Published : Oct 2, 2021, 9:49 PM IST

Fish Farming: చేపల పెంపకంలో సరికొత్త టెక్నాలజీ

గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన సత్యదేవ్‌ రాజు.. సీఏ పూర్తిచేశారు. కొన్నాళ్లు సివిల్ సర్వీసెస్‌కూ సన్నద్ధమయ్యారు. సొంతంగా ఏదైనా చేయాలనే లక్ష్యంతో సేంద్రియ సాగు చేపట్టి ఆరోగ్యకరమైన చేపలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనుకున్నారు. దీనికి రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్‌ సిస్టమ్‌- ఆర్.ఎ. ఎస్ విధానాన్ని ఎంచుకున్నారు. 7 సెంట్ల స్థలంలో... 6 ట్యాంకులు నిర్మించారు. 15 వేల చేపపిల్లలు వేసి 14 టన్నుల దిగుబడి సాధించే దిశగా బాటలు వేస్తున్నారు. ఇప్పటికే 5.6 టన్నులు విక్రయించగా... మరో 8 టన్నుల చేపలు కొన్ని రోజుల్లో అమ్మకానికి సిద్ధం చేస్తున్నారు. నిరంతర పర్యవేక్షణ, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ముందుకు సాగుతున్నారు. 5 ఎకరాల విస్తీర్ణంలో పెంచాల్సిన చేపలను కేవలం 7 సెంట్ల స్థలంలోనే పెంచుతున్నారు. చెరువుల్లో సంప్రదాయంగా 15వేల చేపల్ని పెంచేందుకు 5 కోట్ల లీటర్ల నీరు అవసరం కాగా.... కేవలం 1.06 లక్షల లీటర్ల నీటితోనే సాగు చేస్తున్నారు.


7 సెంట్ల విస్తీర్ణంలోని ఆక్వా ఫామ్‌లో.. 5 సెంట్లలో జి. ఐ.., 6 అల్యూమినియం ట్యాంకులు నిర్మించారు. ట్యాంకు మధ్యలో సెంట్రల్‌ డ్రైనేజ్‌ పైపు ఏర్పాటు చేశారు. దీని ద్వారా చేపల మలమూత్రాలు, వ్యర్థాలు డ్రెయిన్‌లోకి వెళ్తాయి. దీనిపై సాగు ఆధారపడి ఉంటుంది. వివిధ దశల్లో.. 80 నిమిషాల్లో.. లక్షా 6 వేల లీటర్ల నీటిని శుభ్రం చేస్తారు. ఈ ప్రక్రియ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. దీని వల్ల చేపలు ఆరోగ్యంగా ఉండటంతో పాటు.. పెరుగుదల వేగంగా ఉంటుందని సత్యదేవ్‌ తెలిపారు..

"ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 32 లక్షల రూపాయలు పెట్టుబడి ఖర్చయింది. పావు కిలో చేప పిల్లలు తెచ్చి 5 నుంచి 6 నెలలపాటు పెంచితే కిలో నుంచి 1250 గ్రాముల వరకు బరువు పెరుగుతాయి. సగటున 14 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. కొర్రమీను, అపోలో చేపల్ని పెంచుతున్నారు. ఆర్గానిక్ పద్ధతిలో పెంచినందున కిలో 250 రూపాయలకు అమ్ముతున్నాను."

-సత్యదేవ్‌ రాజు, సిరి ఆక్వాఫామ్స్

ఆర్.ఎ.ఎస్ విధానాన్ని ఎంచుకునేవారు ముందుగా దీనిపై అధ్యయనం చేసిన తర్వాతే ప్రారంభించాలని సత్యదేవ్‌ చెబుతున్నారు. షెడ్డులోకి వెలుతురు, గాలి సహజంగా వచ్చేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.

ఇదీ చదవండి:no roads to hills area: ప్రమాదకరంగా కొండవాలు ప్రాంతాలు .. బిక్కుబిక్కుమంటూ రాకపోకలు

ABOUT THE AUTHOR

...view details