గుంటూరు జిల్లా తెనాలిలో ఓ యువతి దిశ యాప్ తో.. తనను తాను రక్షించుకుంది. ఆకతాయిల ఉచ్చులో పడిన ఆ యువతి.. తన ఫోన్ లోని దిశ యాప్ ద్వారా.. 100 నంబర్ కు కాల్ చేసి సమాచారం ఇచ్చింది. వెంటనే స్పందించిన పోలీసులు.. యాప్ ద్వారా ఘటనాస్థలిని గుర్తించి.. ఆ యువతి ఉన్న చోటుకు చేరుకున్నారు.
జరిగిందిలా...
ఉదయం 11.10 నిముషాలకు యాప్ నుంచి కాల్ రాగానే.. 11.11కు సీఐ రాఘవేంద్రకు సమాచారం వెళ్లింది. ఆయన వెంటనే వివరాలు సేకరించి.. తక్షణమే తన సిబ్బందితో కలిసి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాధితురాలి దగ్గరికి చేరుకున్నారు. 11.17 నిమిషాలకు అక్కడికి వెళ్లిన పోలీసులు.. బాధితురాలిని ఆరు నిముషాల వ్యవధిలో కాపాడారు.
మాక్ డ్రిల్....
ఈ సీన్ అంతా.. దిశ యాప్ పై మహిళలు, యువకులకు అవగాహన కలిగించేందుకు పోలీసులు ప్రత్యేకంగా నిర్వహించిన మాక్ డ్రిల్ లో జరిగింది. జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ ఆదేశాల మేరకు.. ఈ మాక్ డ్రిల్ చేశారు. ఇది ప్రత్యేకమైన డ్రైవ్ అని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు. ఎస్పీ ఆదేశాలమేరకు నిర్వహించామని సీఐ రాఘవేంద్ర తెలిపారు. మహిళలు, యువతులు, వృద్ధులు డయల్ 100కు ఎప్పుడు కాల్ చేసినా.. 24 గంటలు అందుబాటులో ఉంటామని వారికి హామీ ఇచ్చారు. రాత్రి వేళల్లో పట్టణంలో పెట్రోలింగ్ పటిష్టం చేసినట్లు వెల్లడించారు. మహిళలు దిశ యాప్ పై అవగాహన పెంచుకోవాలని కోరారు.
ఇదీ చదవండి:
Kambampati Haribabu: 'గవర్నర్ అయినా విశాఖతో అనుబంధం కొనసాగుతుంది'