ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మొబైల్ మార్కెట్ల ద్వారా సరుకుల పంపిణీ - mobile markets in guntur news

గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసర సరుకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మొబైల్ మార్కెట్ల ద్వారా పంపిణీ చేస్తున్నారు.

mobile markets in redzone areas at guntur
గుంటూరులో మొబైల్ మార్కెట్ల ద్వారా సరుకుల పంపిణీ

By

Published : Apr 19, 2020, 2:40 PM IST

గుంటూరులో మొబైల్ మార్కెట్ల ద్వారా సరుకుల పంపిణీ

గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 129కు చేరుకుంది. వైరస్ సోకిన వ్యక్తులు నివసించిన ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి... ఆ ప్రాంతాలకు రాకపోకలు నిలిపివేశారు. అక్కడ నివసించే ప్రజలకు ఇబ్బందులు లేకుండా... మొబైల్ మార్కెట్ల ద్వారా ప్రభుత్వం సరకులు అందిస్తోంది. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details