MLC Son Playing Poker:గుంటూరు జిల్లా మంగళగిరిలో గత రాత్రి పేకాట శిబిరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఓ టింబర్ డిపోలో పేకాడుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేయగా.. 13 మంది పట్టుబడ్డారు. అయితే.. అధికార పార్టీ ఎమ్మెల్సీ కుమారుడు, టింబర్ డిపో యజమాని అక్కడి నుంచి తప్పించుకున్నారని తెలిసింది.
పోలీసులు దాడి చేసినప్పుడు అక్కడే ఉన్న ఎమ్మెల్సీ కుమారుడు.. వారిని తోసుకుంటూ వెళ్లిపోయనట్లు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు.. 14వ నిందితుడిగా టింబర్ డిపో యజమాని పేరు, 15వ నిందితుడిగా ఎమ్మెల్సీ కుమారుడి పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు. తప్పించుకున్న నిందితులను పట్టుకొని న్యాయస్థానంలో ప్రవేశపెడతామని పోలీసులు తెలిపారు.