ప్రభుత్వ ఉద్యోగులు జీతాల్లో 50 శాతం కోత విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్సీ రామకృష్ణ ఒక్కరోజు నిరసన దీక్ష చేపట్టారు. గుంటూరులోని తన నివాసంలో చేపట్టిన నిరసన దీక్షకు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, పలువురు తెదేపా నేతలు సంఘీభావం తెలిపారు. ఉద్యోగులు, పెన్షనర్లుకు ఇచ్చే జీతాల్లో 50 శాతం కోత విధించడం మంచి పద్ధతి కాదని, తక్షణమే 100 శాతం వేతనాలు చెల్లించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏది చేస్తే అదే సీఎం జగన్ చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్.. తన ఆలోచనలకు పదును పెట్టడం లేదని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించడం సరికాదన్నారు. ఇప్పటికైనా ఉద్యోగులకు 100 శాతం జీతాలను చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగుల జీతాాల్లో కోతలకు నిరసనగా ఎమ్మెల్సీ రామకృష్ణ దీక్ష - mlcs one day protest in Ap
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీతాల్లో కోత విధించడాన్ని కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ రామకృష్ణ తప్పుబట్టారు. కోతలకు నిరసిస్తూ గుంటూరులోని తన నివాసంలో ఒక్కరోజు దీక్ష చేపట్టారు. రామకృష్ణ నిరసనకు తెదేపా నేతలు సంఘీభావం తెలిపారు.
ఉద్యోగుల జీతాాల్లో కోతలకు నిరసనగా ఎమ్మెల్సీ రామకృష్ణ దీక్ష