రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను తక్షణమే రద్దు చేయాలనీ కోరుతూ ప్రజల పక్షాన హైకోర్టు లో వ్యాజ్యం వేసినట్లు ఎమ్మెల్సీ రామకృష్ణ చెప్పారు. 14న జరగనున్న విచారణలో అమరావతి రైతులకు మద్దతుగా తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇకనైనా మూడు రాజధానుల నిర్ణయాన్ని మార్చుకుని అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్నారు.
'జగన్ ఇకనైనా.. 3 రాజధానుల నిర్ణయం మార్చుకోండి' - అమరావతి రైతుల నిరసనలు న్యూస్
రాజధాని అమరావతిని తరలించడం చట్టబద్ధత కాదని ఎమ్మెల్సీ రామకృష్ణ , తెదేపా నేత మన్నవ సుబ్బారావు అన్నారు. 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు 240 రోజులుగా చేస్తున్న నిరసన దీక్షలకు సంఘీభవంగా గుంటూరులో ఒక్కరోజు నిరసన దీక్షను చేపట్టారు.
mlc ramakrishna on 3 capitals