MLC Kavitha Letter To CBI : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో.. రేపు విచారణకు హాజరు కాలేనని ఎమ్మెల్సీ కవిత సీబీఐకి తెలిపారు. ఈ నెల 11, 12, 14, 15వ అందుబాటులో ఉంటానని వెల్లడించారు. ఎఫ్ఐఆర్, కేంద్రం ఇచ్చిన ఫిర్యాదు కాపీని ఇవ్వాలని సీబీఐని కవిత కోరిన సంగతి తెలిసిందే. ఎఫ్ఐఆర్ కాపీ వెబ్‌సైట్‌లో ఉందని ఈ మెయిల్ ద్వారా అధికారులు కవితకు తెలియజేశారు. అనంతరం వెబ్‌సైట్‌లోని అన్ని అంశాలు పరిశీలించిన కవిత.. నిందితుల పేర్లతో సహా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించానని.. తన పేరు ఎక్కడా లేదని సీబీఐకి లేఖ రాశారు.
'ఎఫ్ఐఆర్లో నా పేరు లేదు.. రేపు విచారణకు రాలేను' - ఎపీ తాజా వార్తలు
MLC Kavitha Letter To CBI : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ తనకు నోటీసులివ్వడంపై ఎమ్మెల్సీ కవిత మరోసారి స్పందించారు. సీబీఐ ఎఫ్ఐఆర్లో తన పేరు లేదని.. ఈ కేసులో రేపు విచారణకు హాజరుకాలేనని సీబీఐకి లేఖ రాశారు. ముందుగా ఖరారైన కార్యక్రమాల కారణంగా విచారణకు హాజరు కావడం లేదని లేఖలో పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha Letter To CBI in Delhi liquor scam case : ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల ఈ నెల 6వ తేదీన తాను సీబీఐ విచారణకు హాజరు కాలేనని అధికారులకు ఎమ్మెల్సీ కవిత సమాచారం ఇచ్చారు. ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో ఒక రోజు హైదరాబాద్లోని తన నివాసంలో సమావేశం కావడానికి అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. త్వరగా తేదీని ఖరారు చేయాలని పేర్కొన్నారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, దర్యాప్తునకు సహకరిస్తానని కవిత పునరుద్ఘాటించారు.
ఇవీ చదవండి: